Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 15మంది మావోలు హతం

Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 15మంది మావోలు హతం
X

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో 15మంది మావోయిస్టులను అంతం చేసినట్లు భద్రతాబలగాలు ప్రకటించాయి. అక్కడి గోగుండా కొండమీది ఉపంపల్లిలో మావోయిస్టులకు, భద్రతాబలగాలకు మధ్య ఈరోజు ఉదయం కాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు జవాన్‌లకు గాయాలైనట్లు సమాచారం. కాగా, ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడినట్టు అధికారులు తెలిపారు. డీఆర్జీకి చెందిన ఈ జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైనట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఘటనా స్థలిలో 16 మంది మావోయిస్ట్‌ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది అని చెప్పారు. ఘటనా స్థలిలో భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాు. ఏకే-47 రైఫిల్స్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, రాకెట్ లాంఛర్లు, బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్లు, పేలుడు పదార్థాలు ఇందులో ఉన్నాయని వివరించారు.

Tags

Next Story