Manipur: మణిపూర్‌ సీఎం పొరుగింట్లో అగ్ని ప్రమాదం

Manipur:  మణిపూర్‌ సీఎం పొరుగింట్లో అగ్ని ప్రమాదం
X
ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు

మణిపూర్‌ సీఎం ఎన్‌ బీరేన్‌ సింగ్‌ అధికారిక నివాసం సమీపంలోని ఓ ఇంట్లో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఇల్లు గోవా మాజీ ప్రభుత్వ కార్యదర్శి టీ కిప్జెన్‌కు చెందినది. అయితే ఓ ఏడాది నుంచి దీనిని ఖాళీగా వదిలేశారు. ప్రమాదానికి కారణం ఏమిటో తెలియాల్సి ఉంది. మూడు అగ్నిమాపక వాహనాలు దాదాపు ఓ గంటసేపు శ్రమించి, మంటలను ఆర్పేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags

Next Story