Mamata : బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేస్తోంది

ఈవీఎంలను హ్యాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో నెగ్గడానికి భాజపా ప్రణాళికలను సిద్ధం చేసుకుందని చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి భాజపా ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అందుకు తగ్గ ఆధారాలను కూడా సేకరించామని తెలిపారు. మరిన్ని ఆధారాలను కూడా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న విపత్తులు, నిరుద్యోగం, మతపరమైన ఉద్రిక్తతల నుంచి విపక్ష కూటమి 'ఇండియా' మాత్రమే కాపాడుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. బంగాల్ సచివాలయం వద్ద మీడియా సమావేశంలో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ మాతృభూమి అన్న మమత ఆ మాతృభూమి కోసం ఈ ఇండియా కూటమి పోరాడుతుందన్నారు. బీజేపీ ఎప్పుడూ అసూయతో ఉంటుందని, ఆధునికత సాకుతో మెట్రో స్టేషన్లను అంతా కాషాయమయంగా మార్చేస్తోందన్నారు.
అయితే మమతా బెనర్జీ చేసిన సంచలన ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత రాహుల్ సిన్హా స్పందించారు. ఈవీఎంలను ఎవరు హ్యాక్ చేస్తారో దేశం మొత్తం ఇప్పటికే చూసిందన్నారు. 2021లో గెలిచినప్పుడు వారు ఈవీఎం హ్యాకింగ్ గురించి ఎందుకు ఫిర్యాదు చేయలేదంటూ కౌంటర్ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com