Aadhaar Update : 5 ఏళ్లు దాటాక పిల్లల ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి.

ఐదేళ్లు దాటిన పిల్లల ఆధార్ కార్డును తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఈ నియమాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇటీవలే మరోసారి స్పష్టం చేసింది. సాధారణంగా, ఐదేళ్ల లోపు పిల్లలకు ఇచ్చే ఆధార్‌ను "బాల ఆధార్" లేదా "బ్లూ ఆధార్" అంటారు. ఈ ఆధార్ కార్డులో వేలిముద్రలు, కనుపాప (ఐరిస్) స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలు తీసుకోరు. కేవలం పేరు, పుట్టిన తేదీ, ఫోటో తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తారు. ఐదేళ్లు నిండిన తర్వాత పిల్లల శరీరంలో బయోమెట్రిక్ లక్షణాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. అందుకే, వారి వేలిముద్రలు, కనుపాప, కొత్త ఫోటోను అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఏడేళ్ల వయస్సు దాటిన తర్వాత కూడా అప్‌డేట్ చేయకపోతే, పిల్లల ఆధార్ నంబర్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఆధార్‌తో అనుసంధానమైన ప్రభుత్వ పథకాలు, స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, మరియు ఇతర సేవలను పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. UIDAI ఇప్పటికే రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్లకు ఈ అప్‌డేట్ గురించి ఎప్పటికప్పుడు SMSలు పంపుతోంది. మీ పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఈ అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com