Manmohan Singh : మారుతి 800 అంటేనే మన్మోహన్ కు ఎంతో ఇష్టం

మన్మోహన్ సింగ్ తన కెరీర్ లో ఎన్నో పదవులు నిర్వర్తించారు. ప్రొఫెసర్ దగ్గర్నుంచి.. రిజర్వు బ్యాంక్ గవర్నర్.. ఆర్థిక మంత్రిగా.. దేశ ప్రధానిగా ఇలా కీలక పదవులు చేపట్టారు. ఆయా సందర్భాలలో ఎంతో ఖరీదైన లగ్జరీ కార్లలో తిరిగారు. కళ్లెదుట విలాసవంతమైన జీవితం.. ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం తన సొంత మారుతి 800 అంటేనే ఇష్టం. మన్మోహన్ హయాంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చీఫ్గా ప నిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి అరుణ్ అసిమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మన్మోహన్ కు ఉన్నదే ఒక్క కారు.. అది మారుతి 800.. దాని ప్రధాని తన నివాసంలో బీఎండబ్ల్యు వెనుక పార్క్ చేసేవారట. దాన్ని చూపింది ఇది నా కారు అంటూ తరచూ గర్వంగా చెప్పుకునే వారట. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన సొంతంగా కొనుగోలు చేసిన ఆ కారుకు ఎంతో విలువిచ్చేవారని, దాన్నిచూస్తే ఓ ప్రధానిగా సామాన్యులకు చేయాల్సిన పని గుర్తుకొస్తుంది అనే వారట. కోట్ల విలువచేసే కారు ప్రధానిది.. కానీ నా కారు ఎప్పటికీ మారుతినే అనేవారట.. ఈ సంగతులను అరుణ్ గుర్తుచేసుకంటూ మాజీ ప్రధాని మృతికి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మన్మోహన్ వద్ద పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. 2004-2007 వరకు సింగ్ ఎస్పీజీకి అరుణ్ హెడ్ గా పనిచేశారు. ప్రస్తుతం యూపీలోని కన్నౌజ్ సదర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com