Encounter : ఎన్‌కౌంటర్‌లో మావో అగ్రనేత జగన్ హతం

Encounter : ఎన్‌కౌంటర్‌లో మావో అగ్రనేత జగన్ హతం

ఛత్తీస్ గఢ్ లో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల్లో ఆ పార్టీ అగ్రనేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ ఉన్నారు. దంతెవాడ ఎస్పీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎన్ కౌంటర్ మృతుల వివరాలతోపాటు జగన్ క్కు సంబంధించిన సమాచారంతో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర మిలిటరీ ఇన్చార్జ్, మహారాష్ట్ర ఛత్తీస్ గఢ్ బార్డర్ ఇంచార్జ్ గా పనిచేస్తున్న జగన్ 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కలిగిన ఉద్యమకారుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్టు కేంద్ర పార్టీలో కీలక స్థాయికి చేరుకున్నారు. రణదేవ్ భార్య మాచర్ల లక్ష్మక్క గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది.

కేంద్ర మిలిటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర- ఛత్తీస్గఢ్ బార్డర్ ఇన్ఛార్జ్ కొనసాగుతున్న రణదేవ్ స్వస్థలం హన్మకొండ జిల్లాలోని కాజీపేట మండలం టేకులగూడెం. ఏసోబు మరణ వార్తతో ఆ గ్రామం లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈనెల 3న ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ, బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి జగన్ సహా అరుగురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.

Tags

Next Story