Budget 2024 : బడ్జెట్‌లో అది జరిగితే మార్కెట్ క్రాష్

జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ప్రభుత్వం తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వాస్తవానికి సంకీర్ణ భాగస్వాములతో కూడిన ప్రభుత్వంపై సామాన్యులతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో జెఫరీస్ లో ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ కీలక కామెంట్స్ చేశారు. భారతదేశంలో ఈక్విటీ సంస్కృతిని అభి వృద్ధి చేసే విషయంలో భారతీయ స్టాక్ మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని క్రిస్టోఫర్ వుడ్ అభిప్రాయపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం ఈక్విటీలపై మూలధన లాభాల పన్నులో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే, జూన్ 4న జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మెజారిటీ కోల్పోయినా ఏర్పడిన దాని కంటే ఎక్కువ మార్కెట్ కరెక్షన్ కు దారితీయవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరగడం వల్ల భారతీయ స్టాక్ మార్కెట్ భవిష్యత్తుపై వుడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ట్రెండ్ మార్కెట్ ను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.
బీజేపీకి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ జూన్ 4 నుంచి స్టాక్ మార్కెట్ త్వరగా పుంజుకుని 13.3% పెరిగింది. సంకీర్ణ భాగస్వాములను సంతృప్తి పరచడానికి జనాకర్షక చర్యల సంకేతాల కోసం 2024 బడ్జెట్ ను నిశితంగా పరిశీలించాలని వుడ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com