Fire accident: తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఆస్పటల్ లో భారీ ఆగ్నిప్రమాదం..

Fire accident: తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఆస్పటల్ లో భారీ ఆగ్నిప్రమాదం..
X
ఏడుగురు సజీవ దహనం.. 20 మందికి తీవ్ర గాయాలు..

తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. హస్పటల్ లో మంటలు చెలరేగిడంతో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని మరో దావాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, పలువురు రోగులు, సిబ్బంది మంటల్లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కాగా, ప్రముఖ ఆర్థోపెడిక్ హస్పటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. దిండిగల్- తిరుచ్చి హైవేపై ఉంది ఈ ఆసుపత్రి. గ్రౌండ్ ఫ్లోర్ లోని రిస్పెషన్ ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. చూస్తుండగానే, క్షణాల్లో మంటలు భవనంలోని అన్ని ఫ్లోర్స్ కు పాకిందని పోలీసులు చెప్పుకొచ్చారు. మంటలు చెలరేగడంతో అక్కడ భారీగా పొగ వ్యాప్తి చెందింది. దీంతో శ్వాస పీల్చుకోలేక రోగులు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే, అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అధికార యంత్రాంగం స్పందించి.. 50 అంబులెన్స్ లను రంగంలోకి తీసుకొచ్చింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను సేఫ్ ప్లేస్ లోకి తరలించారు.

Tags

Next Story