Meerut Murder: ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసి, ముక్కలుగా నరికి సిమెంట్ డ్రమ్ములో దాచిన ఘటనను మరువకముందే యూపీలోని మీరట్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను గొంతు నులిమి చంపి పాముకాటుతో అతడు చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది.
అయితే శవ పరీక్షలో అసలు విషయం తేలడంతో పోలీసులు భార్యను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కూలీగా పనిచేసే అమిత్ గత శనివారం రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేశాక నిద్రపోయాడు. అప్పుడు అతడి భార్య రవిత(25), తన ప్రియుడు అమర్‌దీప్ సాయంతో అమిత్ గొంతు నులిమి చంపేసింది.
పాము కాటు వల్ల తన భర్త చనిపోయాడని జనాల్ని నమ్మించేందుకు అతడి పడకపై ఒక పామును వదిలి పెట్టి ంది.అయితే గొంతు నులమడం వల్లే బాధితుడు చనిపోయాడని శవ పరీక్ష ద్వారా తెలుసుకొన్న పోలీసులు రవితను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల కిందట మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతడి భార్య రస్తోగి ప్రియుడితో కలిసి హత్య చేసి, శవాన్ని ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో దాచిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com