PM Modi : గేమర్లతో ప్రధాని భేటీ.. మోడీ ఇచ్చిన సలహా ఇదే!

దేశంలోని అగ్రశ్రేణి గేమర్లు ప్రధాని మోడీతో మీటింగ్ అయ్యారు. ఎన్నికల టైంలో పాపులారిటీ కోసం చేసిన పనేనని అపోజిషన్ అంటున్నప్పటికీ.. ఈ మీటింగ్ ద్వారా మంచి మెసేజ్ బయటకొచ్చింది. సామాజిక సమస్యలను పరిష్కరించే గేమ్‌లను తయారు చేయాలని, 'స్వచ్ఛ్ భారత్' ఆధారంగా ఒక గేమ్‌ను అభివృద్ధి చేయాలని గేమర్‌లను కోరారు ప్రధాని మోడీ.
ఇండియా గేమ్స్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇండియాలోనూ మార్కెట్ పెరిగింది. భారతీయ పురాణాల నుండి ప్రేరణ పొందిన ఆటలు బాగా గుర్తింపు పొందాయి. ప్రసిద్ధ భారతీయ గేమర్‌లలో అనిమేష్ అగర్వాల్, నమన్ మాథుర్, మిథిలేష్ పాటంకర్, పాయల్ ధరే, తీర్థ్ మెహతా, గణేష్ గంగాధర్, అన్షు బిష్త్ మోడీతో మీటింగ్ లో పాల్గొన్నారు.
గేమింగ్ నియంత్రణ, సృజనాత్మక అభివృద్ధి, సామాజిక అవగాహనను పెంపొందించడంలో గేమింగ్ పాత్ర పోషించాల్సిన అంశాలపై వారితో మోడీ చర్చించారు. అలాగే, గేమింగ్, జూదం మధ్య వ్యత్యాసం, గేమింగ్ పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం మరిన్నింటి గురించి కూడా చర్చించారు. గేమర్‌లు తమ సమస్యలన్నింటినీ తన కార్యాలయానికి తెలియజేస్తూ ఈ-మెయిల్ పంపాలని కూడా ఆయన కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com