Pemmasani Chandrasekhar : ఆ కారణాల వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారు - పెమ్మసాని చంద్రశేఖర్

Pemmasani Chandrasekhar : ఆ కారణాల వల్ల ఏటా లక్షల మంది చనిపోతున్నారు - పెమ్మసాని చంద్రశేఖర్
X

రోగ నిర్ధారణలో జాప్యం, సరైన వైద్యం అందకపోవడం వల్ల దేశంలో ఏటా లక్షల మంది మృత్యువాత పడుతున్నారని కేంద్రసహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రజల ఆరోగ్యానికి, నాణ్యమైన వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య సేవల డైరెక్టర్ జనరల్ సహకారంతో ఏర్పాటు చేసిన నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్-2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోగుల భద్రతపై అవగాహన పెంచేందుకు దేశంలోని అన్ని బోధనాసుపత్రులు, వైద్య సంస్థల ప్రతినిధులతో ఈ జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

విచ్చలవిడి యాంటిబయోటిక్స్ వాడకంపై హెచ్చరిక వైద్య సేవలలో లోపాలు తగ్గించి, సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచాలని ఆయన సూచించారు. ముఖ్యంగా విచ్చలవిడిగా వాడుతున్న యాంటిబయోటిక్స్‌ను నియంత్రించకపోతే భవిష్యత్తులో పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది.

Tags

Next Story