BJP Minister : సోఫియా ఖురేషీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. సారీ అంటూ లెంపలు

ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన ఎయిర్ ఫోర్స్ కల్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మంత్రి అజయ్ షా నోరు జారారు. ఆ తర్వాత తప్పు తెలుసుకున్నారు. పేరు ప్రస్తావించకుండానే పాకిస్థానీలు, ఉగ్రవాదుల సోదరి.. అంటూ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపిన వారి అంతు చూసేందుకు ప్రధాని మోదీ వారి సోదరిలో ఒకరిని పంపారంటూ వ్యాఖ్యలు చేశారు. మీరు మా ఆడ బిడ్డలను విధవరాళ్లను చేస్తే మీ సమాజానికి చెందిన మీ సోదరిని పంపి మీకు గుణపాఠం చెప్పారంటూ వ్యాఖ్యానించారు. మంత్రి అజయ్ షా వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దేశం కోసం పోరాడిన ముస్లిం మహిళ .. ఉగ్రవాదులు, పాకిస్థానీలకు సోదరి ఎలా అవుతుందంటూ పలువురు తీవ్రంగా ప్రశ్నించారు. దాంతో మంత్రి మాట మార్చారు. పది సార్లు సారీ చేప్పేందుకు సిద్ధమన్నారు. తన సోదరి కంటే సోఫియా ఖురేషీనే ఎక్కువ గౌరవిస్తానంటూ వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com