TN : నా కొడుకు డిప్యూటీ సీఎం కావాలంటే టైం పడుతుంది.. స్టాలిన్ హాట్ కామెంట్స్

TN : నా కొడుకు డిప్యూటీ సీఎం కావాలంటే టైం పడుతుంది.. స్టాలిన్ హాట్ కామెంట్స్
X

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ( MK Stalin ) తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగిస్తారని అధికార డీఎంకేలో కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్టాలిన్ తాజాగా స్పందించారు. ఉదయనిధి డిప్యూటీ సీఎం కావడానికి ఇంకా సమయం ఉందన్నారు.

ఉదయ నిధికి ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్ప గించాలంటూ పార్టీ నుంచి డిమాండ్ పెరుగుతోందని స్టాలిన్ తెలిపారు. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి, డీఎంకే పార్టీ యూత్ వింగ్ సెక్రటరీ ఉదయనిధి కొనసాగుతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించాలని చాలాకా లంగా పార్టీ నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

గతంలో స్పందించిన ఉదయనిధి.. దీనిపై సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story