MLC Kavitha : అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : అమెరికా వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
X

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత అమెరికాకు వెళ్ళారు. తన చిన్న కొడుకు ఆర్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు కవిత. ఈ మేరకు ఉదయం 9.30కి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం ఇంటర్నేషనల్ డిపార్చర్ నుంచి బోర్డింగ్ పాయింట్ కు వెళ్ళారు. కవిత భర్త అనిల్ తో పాటు.. తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు వచ్చి ఆమెకు సెండాఫ్ చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ కవిత 15 రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తన తండ్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. 15 రోజుల పర్యటన అనంతరం తిరిగి సెప్టెంబర్ 1న ఆమె హైదరాబాద్ కు రానున్నారు.

Tags

Next Story