PM Modi : కాంగ్రెస్ వి క్యాస్ట్ పాలిటిక్స్ : మోదీ

కాంగ్రెస్ వి క్యాస్ట్ పాలిటిక్స్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, బీసీలను విడదీయటం, వారి మధ్య విభేదాలు సృష్టించడం ఒక్కటే అంజెడా అని ఆరోపించా రు. అందుకే 'ఒక్కటిగా ఉంటేనే అందరికీ రక్షణ' అని అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సం దర్భంగా ధూలేలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని చె ప్పుకొచ్చారు. వారి మధ్య కొట్లాటలు జరిగేలా కాంగ్రెస్ భయంకరమైన ప్రణాళిక తయారు చేసిందన్నారు. “ఆదివాసీలు కలిసి ఉంటే వారి శక్తి పెరగదా చెప్పండి? వివిధ కులాలుగా చీలిపో వడం వల్ల బలహీనులవుతారు. అందుకే మనం కలిసి ఉంటే మనం సురక్షితంగా ఉంటాం (ఏక్ హై తో సేఫ్ హై). కాంగ్రెస్ పన్నిన డేంజరస్ గేమ్ లోఓడించేందుకు, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు మనం కలిసికట్టుగా ఉండాలి' అని ప్రధాని మోదీ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com