PM Modi : మోదీ మరో ఘనత.. అత్యంత విశ్వసనీయ నేతగా రికార్డ్

ప్రధాని మోదీ మరో ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇండియన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నాయకుడిగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారని బీజేపీ నేత మాలవీయ ట్వీట్ చేశారు. భారత్ సురక్షితమైన చేతుల్లోనే ఉందని అందులో రాసుకొచ్చారు.
ఈ ఏడాది జులై 4 నుంచి 10 మధ్య మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే చేపట్టింది. అత్యంత విశ్వసనీయత కలిగిన లీడర్‌గా 75శాతం సపోర్ట్‌తో మోదీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. 57శాతంతో సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ జే-మ్యుంగ్ రెండో స్థానంలో నిలిచారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి, కెనడా ప్రధాని మార్క్‌కార్నీ తదితరులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44శాతంతో 8వ స్థానంలో నిలిచారు. కాగా 2021, 2022, 2024లోనే మోదీ అగ్రస్థానంలో నిలిచారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com