PM Modi : రంగంలోకి మోడీ.. శాంతి కోసం ప్రయత్నాలు

X
By - Manikanta |23 Jun 2025 11:45 AM IST
అమెరికా యుద్ధ చర్యలను ప్రపంచదేశాలు ఖండించాలని ఇరాన్ పిలుపుపై ముందుగా భారత్ స్పందించింది. ప్రధాని మోడీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జరిగిన నష్టానికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అత్యవసరంగా ఉద్రిక్తతలను చల్లార్చాలని ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు పిలుపునిచ్చారు. యూఎన్ఓ కూడా స్పందిస్తూ, తక్షణం శాంతి చర్చలు ప్రారంభవించాలని ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు పిలుపునిచ్చింది. ఆ వెంటనే చైనా, సౌదీలు అమెరికా దాడులను ఖండించాయి. ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు ఏవిధంగా స్పందిస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఏ క్షణంలోనైనా అమెరికా నగరాలపై ఇరాన్ విరుచుకుపడే ప్రమాదం ఉందని భావిస్తూ అమెరికా భద్రతా వ్యవస్థలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com