Jaishankar : మోదీ దూతకు సహజంగానే ఎక్కువ మర్యాద దొరుకుతుంది: జైశంకర్

తొలి హయాంలో మోదీ సర్కారుతో మొదలైన సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డొనాల్డ్ ట్రంప్ బృందం ఆత్రుత ప్రదర్శిస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో తొలి వరుసలో కూర్చోవడంపై స్పందించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక దూతకు సహజంగానే ఎక్కువ మర్యాద లభిస్తుంది’ అని ప్రెస్‌మీట్లో చెప్పారు. మోదీ పంపిన లేఖను ట్రంప్ చేతికిచ్చానని తెలిపారు. బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు ఇదే ఉదాహరణ అన్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్న భారతీయ వలసదారులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇటీవలే అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రతినిధిగా జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు, భారత విదేశాంగ విధానం వంటి అంశాలపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com