PM Modi : ఉగ్రవాదాన్ని సహించం.. తేల్చిచెప్పిన మోదీ

PM Modi : ఉగ్రవాదాన్ని సహించం.. తేల్చిచెప్పిన మోదీ
X

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. 2019లో క్రైస్ట్ చర్చ్ నగరంపై జరిగిన అటాక్ అయినా.. 2008లో ముంబైపై దాడి అయినా తమవైఖరి ఒకటే అని స్పష్టంచేశా రు. ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు వ్యతి రేకంగా జరిగే పోరాటంలో సహకారాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇండియాలో పర్యటిస్తోన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో మోదీ భేటీ అయ్యారు. ఈసం దర్భంగా రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించే దిశగా ఒప్పందంపై సంతకాలు చేశారు. అలాగే పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ అగ్రిమెంట్ తో ఇరు దేశాలకు ఉపయోగపడే రీతిలో వాణిజ్య సామర్థ్యం పెరుగుతుందని, పాడిపరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags

Next Story