Modi Gifts Biden Couple : బైడెన్ దంపతులకు మోడీ అత్యంత ఖరీదైన కానుక

Modi Gifts Biden Couple : బైడెన్ దంపతులకు మోడీ అత్యంత ఖరీదైన కానుక
X

అమెరికా అధ్యక్షుడు జో బైడెను చాలా ఖరీదైన బహుమతులు అందాయి. విదేశీ ప్రముఖులు తమ అధికారిక పర్యటనల్లో భాగంగా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కు ఖరీదైన బహుమతులు అందజేశారు. వీటిల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. జిల్ బైడెన్ కు ఇచ్చిన గిఫ్ట్ అత్యంత ఖరీదైనదిగా తెలిసింది. 2023 జూన్ లో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. వాషింగ్టన్ డీసీలో ఉన్న శ్వేతసౌధంలో ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోడీకి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బైడెన్ దంపతులకు మోడీ అరుదైన కానుకలు ఇచ్చారు. అందులో 20 వేల అమెరికన్ డాలర్ల విలువైన 7.5 క్యారెట్ల డైమండ్ కూడా ఉంది. దీని ఖరీదు రూ.17.15 లక్షలు. 2023లో అమెరికా అధ్యక్ష దంపతులకు లభించిన అన్ని బహుమతుల్లోకెల్లా ఇదే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్ చూడటానికి భూమి నుంచి వజ్రంలాగా ఉంటుందట. ఆ వజ్రం ఎకో ఫ్రెండ్లీ. సౌర, పవన విద్యుత్తు ద్వారా ఆ వజ్రాన్ని తయారు చేశారు. ఈ వజ్రాన్ని కాగితపు గుజ్జుతో తయారు చేసిన చిన్న పెట్టెలో ఉంచిజిలు అందజేశారు. దీనితోపాటు జిలకు అందినకానుకల్లో యూఎస్లోని ఉక్రేనియన్ రాయబారి ఇచ్చినది రెండవ ఖరీదైన బహుమతిగా తేలింది. 2023లో బైడెన్ దంపతులు అందుకున్న ఖరీదైన బహుమతుల వివరాలను యునైటెడ్ స్టేట్స్ చీఫ్ ఆఫ్ ప్రొటోకాల్ కార్యాలయం తాజాగా విడుదల చేసింది.

Tags

Next Story