PM Modi : దేశ యువత కోసం మోదీ కొత్త పథకం

PM Modi : దేశ యువత కోసం మోదీ కొత్త పథకం
X

దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం రూపకల్పన చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పీఎం వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పేరుతో పథకం అమలు చేస్తామని, పంద్రాగస్టు సందర్భంగా పథకం ప్రారంభించామని, కొత్తగాఉద్యోగంలో చేరిన యువతకు రూ.15వేలు లబ్ధి చేకూరుతుందని మోదీ చెప్పారు. పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి డబుల్‌ దీపావళి అని, సంస్కరణల కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని, హై పవర్‌ కమిటీ ఏర్పాటు చేసి GST సంస్కరణలు తెచ్చి ఈ దీపావళికి బహుమతిగా ఇస్తామని ప్రధాని మోదీ వివరించారు. సామాన్యులకు ప్రయోజనం కలిగేలా రోజువారీ వస్తువుల ధరలు అందుబాటులోకి తెస్తామన్నారు. అటు దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు. ఈ వేడుక కోసం ఎర్రకోట పరిసరాల్లో 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 3 వేల మంది ట్రాఫిక్‌ పోలీసులు విధుల్లో ఉన్నారు. మహానగరం యావత్తు కెమెరా నిఘాను పటిష్ఠం చేశారు. ‘నయా భారత్‌’ ఇతివృత్తంతో ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

Tags

Next Story