PM Modi : మోదీ సౌదీ పర్యటన రద్దు

PM Modi : మోదీ సౌదీ పర్యటన రద్దు
X

ప్రధాని మోదీ రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకున్నారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కాసేపట్లో జెడ్డా నుంచి బయలుదేరనున్నారు. ఇవాళ ఉ.5 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర మంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు. ఉగ్రదాడిలో దాదాపు 30 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.

పహల్గామ్ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో గాయపడ్డ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలని, వారికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని Xలో పోస్ట్ చేశారు.

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ముర్ము ఖండించారు. ఆ ఘటన చాలా బాధ కలిగించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉగ్రదాడి గురించి తెలిసి షాక్‌కు గురయ్యాను. ఇది పిరికిపంద చర్య. అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అమాయక పౌరులపై దాడి చేయడం క్షమార్హం కాదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఉగ్రదాడిని ఖండించారు.

Tags

Next Story