PM Modi : సౌదీలో పర్యటించనున్న మోదీ

PM Modi : సౌదీలో పర్యటించనున్న మోదీ
X

ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీలో పర్యటిస్తారు. 2016, 2019 తర్వాత మూడోసారి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశంలో పర్యటించనున్నారు. 2023 సెప్టెంబర్‌లో G20 సమ్మిట్‌, సౌదీ-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య తొలి సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ యువరాజు ఇండియా వచ్చిన విషయం తెలిసిందే. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో పర్యటించి జి-20 సదస్సు, ఇండియా-సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్‌కు కో-చైర్మన్‌గా వ్యవహరించారని, ఆ సందర్భంలో మోదీని తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్, సౌదీ మధ్య చిరకాల మైత్రీసంబంధాలు ఉన్నాయి. బలమైన చారిత్రక వాణిజ్య సంబంధాలు, లోతైన సామాజిక-సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నాయి. రాజకీయ, రక్షణ, భద్రత, పెట్టుబడులు, ఇంధనం, టెక్నాలజీ, ఆరోగ్యం, విద్య రంగాల్లోనూ బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తున్నాయి.

Tags

Next Story