ఈజిప్ట్ లో మోదీ

రెండు రోజుల పర్యటన కోసం ఈజిప్టు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక ఈజిప్టు పర్యటనలో మోదీ మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులు అర్పించనున్నారు.ఈజిప్టు దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఆహ్వానం మేరకు రెండు రోజులపాటు మోదీ అక్కడ పర్యటించ నున్నారు. 1997 తర్వాత భారత ప్రధాని ఒకరు ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి. మొదటి ప్రపంచ యుద్ద సమయంలో ఈజిప్టు, పాలస్తీనాల్లో ఉండి పోరాడి మరణించిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించడంతో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది.
మరోవైపు ఈ పర్యటనలో ప్రధాని ఈజిప్టులోని చారిత్రక అల్ హకీమ్ మసీదుని సందర్శించనున్నారు ఈ మసీదు వాస్తవానికి 10వ శతాబ్దం చివరలో, 990లో అల్-హకీమ్ తండ్రి ఖలీఫ్ అల్-అజీజ్ బిల్లా నిర్మాణం ప్రారంభించారు. తరువాత 1013 సంవత్సరంలో అల్-హకీమ్ దీన్ని పూర్తి చేయించారు. ఈజిప్టులోని ఈ చారిత్రాత్మక మసీదును అల్-అన్వర్ అని కూడా పిలుస్తారు. జ్ఞానోదయం అని దీని అర్థం.దీని నిర్మాణ శైలి ఫాతిమిడ్స్ స్థాపించిన ప్రసిద్ధ మొదటి అల్-అజార్ మసీదు లాగానే ఉంటుంది. ఇది కైరో నగరంలో రెండో అతిపెద్ద, నాలుగో పురాతన మసీదు. ఈ మసీదు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ కైరో మధ్యలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com