అమెరికాలో పర్యటించనున్న మోదీ

అమెరికాలో పర్యటించనున్న మోదీ
పర్యటనలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు బైడెన్‌ల మధ్య చర్చల్లో రక్షణ పరిశ్రమల రంగంలో ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి రోడ్డు మ్యాప్‌ రూపొందనుంది.

మూడ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమెరికా బయలుదేరి వెళ్లారు.న్యూయార్క్​ఆండ్రూస్​ఎయిర్ ఫోర్స్​బేస్ చేరుకోనున్న ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. రేపట్నుంచి మోదీ అధికారిక పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు బైడెన్‌ల మధ్య చర్చల్లో రక్షణ పరిశ్రమల రంగంలో ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి రోడ్డు మ్యాప్‌ రూపొందనుంది. వాణిజ్యం పెట్టుబడులు, టెక్నాలజీ, టెలికం, అంతరిక్షం, తయారీ రంగాలపైనా వారి మధ్య చర్చలు జరగనున్నాయి. ‘రక్షణ రంగ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీలోని అన్ని అంశాలపైనా మోదీ, బైడెన్‌ల భేటీ దృష్టి సారించనుంది. ప్రస్తుతం ఉన్నదాని కంటే మరింత మెరుగైన పారిశ్రామిక వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో సహకారంపై చర్చించనుంది. రక్షణ రంగంలో సరఫరా వ్యవస్థల మెరుగుదలపైనా భేటీ దృష్టి సారించనుంది.

మోదీ అధికారిక పర్యటన రేపు న్యూయార్క్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొన్నాక పలువురు ప్రముఖులను ఆయన కలుసుకుంటారు. అదే రోజు సాయంత్రం వాషింగ్టన్‌ చేరుకుని బైడెన్‌ దంపతులు ఇచ్చే ప్రైవేటు విందులో పాల్గొంటారు. 22వ తేదీన అధికారికంగా వైట్‌ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సాయంత్రం అధికారిక విందులో మోదీ పాల్గొంటారు. 23వ తేదీన ఎంపిక చేసిన సీఈవోలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఇచ్చే విందులో పాల్గొంటారు.

అమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ 24వ తేదీన ఈజిప్టుకు చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌ సిసి ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఈజిప్టులో మోదీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా 11వ శతాబ్దంనాటి అల్‌ హకీం మసీదును సందర్శిస్తారు. ఇటీవలే దానిని బొహ్ర కమ్యూనిటీవారు ఆధునికీకరించారు.

Tags

Read MoreRead Less
Next Story