Modi : మోడీ దౌత్య విజయం.. ఖతర్‌లో 8 మంది భారతీయులు విడుదల

Modi : మోడీ దౌత్య విజయం.. ఖతర్‌లో 8 మంది భారతీయులు విడుదల

నరేంద్ర మోడీ (Modi) నాయకత్వంలో భారత్‌ దౌత్యపరంగా మరో భారీ విజయాన్ని సాధించింది. గూడఛర్యం ఆరోపణలతో ఖతర్‌ కోర్టు మరణశిక్ష విధించిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులను ఆ దేశం విడుదల చేసింది. వీరిలో ఇప్పటికే ఏడుగురు స్వదేశానికి చేరుకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.

ఖతర్ నిర్ణయాన్ని స్వాగతించిన భారత కేంద్ర ప్రభుత్వం.. అక్కడి పాలకులకు కృతజ్ఞతలు తెలిపింది. అల్ దహ్రా గ్లోబల్ కంపెనీ అనే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ సిబ్బందిలో ఏడుగురు ఖతర్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారని చెప్పింది.

అల్ దహ్రా సంస్థలో పనిచేసిన భారత దేశ పౌరులు గూఢచర్యం ఆరోపణలపై ఆగస్టు 2022లో అరెస్టయ్యారు. అక్టోబర్ 26, 2023న ఖతార్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ నేవీ వెటరన్‌లకు మరణశిక్ష విధించింది. భారతదేశం ఈ తీర్పును దిగ్భ్రాంతికరమైనదిగా అభివర్ణించింది. ఈ కేసులో అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా, MEA ఈ కేసుకు హైఎఎస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్లు, అన్ని చట్టపరమైన ఎంపికలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. మార్చి 25, 2023న భారతీయ పౌరులపై అభియోగాలు నమోదు చేయబడ్డాయి. ఖతార్ చట్టం ప్రకారం వారిని విచారించారు. భారత్ దౌత్యంతో వారి విడుదలకు మార్గం సుగమమైంది.

Tags

Read MoreRead Less
Next Story