Rahul Gandhi : మోహన్ భాగవత్ వ్యాఖ్యలు దేశ ద్రోహమే : రాహుల్ గాంధీ విమర్శలు

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన జరిగిన రోజునే భారత్ కు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్న భాగవత్ వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకే వస్తాయని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ మా ట్లాడుతూ.. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఒకటి తమ రాజ్యాంగ సిద్ధాంతం, మరొకటి ఆర్ఎస్ఎస్ భా వజాలమని చెప్పారు. 1947లో దేశానికి స్వా తంత్ర్యం రాలేదంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దేశ ప్రజలందరినీ అవమానించారని అన్నారు. ఇలా బ్రిటీష్ వారిపై పోరాడిన యో ధులందరినీ ఆయన కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి పిచ్చిమాటలు ఆపాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాం తాలకు కట్టుబడి ఉన్నారని ఆయన ఈసందర్భం గా గుర్తుచేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగేది తమ పార్టీ మాత్రమేనని అన్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందని, దాన్ని కొన సాగిస్తామని వెల్లడించారు. కొత్తగా ప్రారంభిం చుకున్న ఇందిరా భవన్.. కాంగ్రెస్ కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకున్నదని, ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకూ చెందుతుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com