భారత్ లో కొత్తగా 92 వేలకు పైగా పాజిటివ్ కేసులు

భారత్ లో కొత్తగా 92 వేలకు పైగా పాజిటివ్ కేసులు
దేశంలో కోరాన మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో నిత్యం 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా..

దేశంలో కోరాన మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో నిత్యం 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 92 వేల 71 పాజిటివ్ కేసులు నమోదైనట్టు.. కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48 లక్షల 46 వేల 428కి చేరింది. ప్రస్తుతం 9 లక్షల 86 వేల 598 యాక్టివ్ కేసులు ఉండగా... 37 లక్షల 80 వేల 108 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఒక్క రోజులో మరో 11 వందల 36 మంది వైరస్‌తో మరణించారు. ఇప్పటి వకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 79 వేల 722కి చేరింది. ఆదివారం ఒక్క రోజుల 9 లక్షల 78 వేల పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటి వరకు 5 కోట్ల 72 లక్షల శాంపిల్స్‌ పరీక్షించినట్టు... ICMR తెలిపింది.

Tags

Next Story