PM : మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్ నరేంద్రమోడీ.. ఇండియా టుడే సర్వేలే వెల్లడి

PM : మోస్ట్ పవర్ ఫుల్ పొలిటీషియన్ నరేంద్రమోడీ.. ఇండియా టుడే సర్వేలే వెల్లడి
X

దేశంలోని రాజకీయ నేతల్లో అత్యంత శక్తిమంతుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే అని ఇండియా టుడే ఓ సర్వేతో తేల్చింది. మోడీ తర్వాతి స్థానాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, హోంమంత్రి అమిత్‌షా, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోని అత్యంత శక్తిమంత నాయకుల్లో ఐదో స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రుల్లో చంద్రబాబే టాప్ లో ఉన్నారు. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తిసామర్థ్యాలను అంచనా వేసింది. నరేంద్రమోడీ వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఎన్నికై.. 60 ఏళ్ల రికార్డు తిరగాశారు. అటు అమెరికాతో.. ఇటు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌ అధినేతలతో ఏకకాలంలో స్నేహసంబంధాలు కొనసాగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థను 4 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లారని విశ్లేషించింది. దేశంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్‌గా ఉన్న చంద్రబాబు.. రాష్ట్ర పరిపాలనపైనా తనదైన ముద్రచూపుతూ ముందుకెళ్తున్నారు. బిహార్‌ సీఎం నీతీష్‌కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారని సంస్థ తెలిపింది.

Tags

Next Story