Kangana Ranaut : ఎంపీ కంగనా రనౌత్ పై రూ.40 కోట్ల పరువు నష్టం దావా

లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ( Kangana Ranaut ) సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నరేంద్ర మిశ్రా రూ.40 కోట్లకు పరువు నష్టం దావా వేశాడు. పార్లమెంట్ లో కుల గణనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్కల్ పై క్యాప్, మెడలో శిలువ, నుదుటిపై తిలకం ధరించి ఉన్న నకిలీ ఫోటోను కంగనా షేర్ చేసింది. దీంతో పరువుకు భంగం కలిగించే పని చేసిదంటూ ఆమెపై నరేంద్ర మిశ్రా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆమెకు నోటీసు పంపించారు.
కంగనా తీరుపై నెటిజన్లు కూడా మండిపడ్డారు. తాజాగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది నరేంద్ర మిశ్రా.. ఆమెపై చట్టపరమైన చర్య తీసు కోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక చిత్రాన్ని అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఐటీ చట్టం ప్రకారం చట్ట విరుద్ధమని మిశ్రా అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిష్టను కించపరిచినందుకు ఆమెపై రూ.10 కోట్ల పరువు నష్టం కేసు వేశామని.. పరిహారం చెల్లించాలని కోరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com