Sanjay Raut : ఎంపీ సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష
శివసేన(యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముంబై కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. అలాగే15 రోజుల జైలు శిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 కింద మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రౌత్‌ను దోషిగా నిర్ధారించి తీర్పు వెల్లడించింది. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు సంబంధించిన రూ.100 కోట్ల కుంభకోణంలో రౌత్ తనపై, తన భర్తపై నిరాధారమైన ఆరోపణలు చేశారని మేధా సోమయ్య ఆరోపించారు. మీడియా ముఖంగా చేసిన ఈ ప్రకటనలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తన ఆరోపణలపై రౌత్ సరైన ఆధారాలు చూపకపోవడంతో దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com