Delhi: దొంగలుగా పొరబడి ఇద్దరి దారుణ హత్య..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా కొట్టిచంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రన్‌హొల్లా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రన్‌హొల్లా ఏరియాలోగల ఓ బార్‌లో రాజేష్ యాదవ్, ముకేశ్ సింగ్ అనే ఇద్దరు స్నేహితులు మద్యం సేవిస్తుండగా.. అక్కడికి కత్తులు, కర్రలతో వచ్చిన నలుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టి, కత్తులతో పొడిచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
దాంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ‘మార్చి 15న మా స్నేహితులను ఇద్దరు వ్యక్తులు దోపిడీ చేశారని, శుక్రవారం ఆ దొంగల ముఠాకే చెందిన ఇద్దరు దొంగలు బార్‌లో మద్యం తాగుతున్నారని సమాచారం అందడంతో వెళ్లి దాడికి పాల్పడ్డామని’ పోలీసుల ఇంటరాగేషన్ నిందితులు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com