President Murmu : ఉపరాష్ట్రపతి రాజీనామాకు ముర్ము ఆమోదం.. తక్షణమే అమల్లోకి..

X
By - Manikanta |22 July 2025 5:15 PM IST
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేసి సంచలనానికి తెరదీశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఈ క్రమంలో ధన్‌ఖడ్ రాజీనామా రాష్ట్రపతి ఆమోదించారు. ఉప రాష్ట్రపతి రాజీనామా రాజ్యాంగంలోని 67(A) అధికరణ కింద తక్షణమే అమలులోకి వస్తుందని రాష్ట్రపతి ఉత్వర్తుల్లో పేర్కొన్నారు.
ప్రధాని మోడీ సైతం ఉపరాష్ట్రపతి రాజీనామాపై స్పందించారు. ఇనాళ్లు ఉప రాష్ట్రపతిగా సేవలందించిన జగదీప్ ధన్‌ఖడ్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అనారోగ్యంతో భాధపడుతోన్న ఆయన పూర్తిగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com