Bihar BJP MLA : హొలి రొజు ముస్లింలు ఇంటికే పరిమితం కావాలి.. బిహార్ బీజేపీ ఎమ్మెల్యే

బిహార్ లోని బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోలీ నాడు ముస్లింలు ఇంటికే పరిమితం కావాలని, ఇంటి నుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. బిహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'శుక్రవారం ప్రార్ధనలు ఏడాదికి 52 రోజులు జరుగుతాయి. కానీ హోలీ మాత్రం సంవత్సరానికి ఒకసారే వస్తుంది. కాబట్టి ఆరోజున ముస్లిం సమాజం బయటకు రాకపోతే మంచిది. ఒకవేళ బయటకు వచ్చినప్పుడు ఎవరైనా వారి మీద రంగు పోస్తే దానిని తప్పుగా అర్థం చేసుకునే చాన్స్ ఉంది. దాని వల్ల పర్యావరణం సైతం పాడుకావొ చ్చు' అని వ్యాఖ్యానించారు. హరిభూషణ్ వ్యాఖ్యలపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆ ర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ ఘాటుగా స్పందించారు. 'హోలీ రోజు ముస్లింలు బయటకు రావొద్దని చెప్పారు. ఈ విషయం చెప్పడానికి హరిభూషణ్ ఎవరు. ఈ రాష్ట్రం ఏమైనా వాళ్ల డాడీదా' అని ప్రశ్నించారు. బచోల్ పై చర్యలు తీసుకునే ధైర్యం సీఎం నితీశ్ కుమార్ కు ఉందా అని నిలదీశారు. ఇది బిహార్ అని రామ్, రహీమ్ లను నమ్మే ప్రాంతమని నొక్కి చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఎల్లప్పుడూ భారతీయ సామరస్యాన్ని చెడగొడుతూనే ఉన్నారని విమర్శించారు ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్. దేశాన్ని విభజించి ద్వేషాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com