PM Narendra Modi : నా బలం నా పేరులో లేదు: మోదీ

PM Narendra Modi : నా బలం నా పేరులో లేదు: మోదీ
X

‘నా బలం నా పేరులో లేదు. 140 కోట్ల ప్రజల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలో ఉంది’ అని ప్రధాని మోదీ చెప్పారు. తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే దేశ ప్రజలందరికీ ఇచ్చినట్లేనని తెలిపారు. ఒక ఉద్దేశ్యంతో గొప్ప శక్తి తనను ఇక్కడి(భూమి)కి పంపిందని, తానెప్పుడూ ఒంటరి కాదన్నారు. బాల్యంలో తన తండ్రి టీ షాపు వద్దకు వచ్చిన వారి నుంచి చాలా నేర్చుకునేవాడినన్నారు. వాటినే ప్రజా జీవితంలో అప్లై చేసినట్లు పేర్కొన్నారు.

గుజరాత్ గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అల్లర్లుగా పేర్కొనడం అనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. 2002 తర్వాత 22 ఏళ్లలో గుజరాత్‌లో పెద్ద అల్లరి జరగలేదని, ఆ రాష్ట్రం శాంతియుతంగా ఉందని చెప్పారు. ఆ సమయంలో కేంద్రంలో తమ ప్రత్యర్థులు అధికారంలో ఉండటంతో తమపై వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారన్నారు. అయితే న్యాయవ్యవస్థ తమను నిర్దోషులుగా తేల్చిందని పేర్కొన్నారు.

Tags

Next Story