Akkineni Family : ప్రధానితో నాగార్జున ఫ్యామిలీ భేటీ

ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబం భేటీ అయ్యింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, చైతన్య, శోభిత ధూళిపాళ్ల పార్లమెంటుకు వెళ్లారు. కాగా, హీరో నాగార్జున గతంలో పలుమార్లు ప్రధాని మోదీని కలిశారు. ఇటీవల టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా కురిపించారు. భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర కొనియాడారు. మోదీ చేసిన వ్యాఖ్యల కు హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. అయితే, అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'తండేల్' విడుదల అయిన రోజునే ప్రధానితో ప్రత్యేక భేటీ ఆసక్తిని పెంచుతోంది. నాగచైతన్య - శోభితను నాగార్జున ప్రధానికి పరిచయం చేసారు. ఇద్దరినీ ప్రధాని అభినందించారు. తండే ల్ చిత్రంలో పాకిస్థాన్‌లో దొరికిపోయిన జాలరిగా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య నటించి అందరిని మెప్పించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన 'తండేల్' సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com