Nana Patole: కాంగ్రెస్ చీఫ్ పాదాలు కడిగిన కార్యకర్త..

మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ కార్యకర్తతో ఆయన కాళ్లు కడిగించుకున్నారు.మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే పాదాలను పార్టీ కార్యకర్త ఒకరు పాదాలను కడుగుతున్నట్టు వైరల్ అయిన వీడియో వివాదాలను రేపుతోంది. పటోలే తన కారులో నుంచి దిగుతుండగా కార్యకర్త నీళ్లు తెచ్చి ఆయన పాదాలను తన చేతుల తోనే కడుగుతున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.
అకోలా జిల్లా వాడెగావ్ ప్రాంతంలో సోమవారం నానాపటోలే పర్యటిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీనిపై అధికార పార్టీ బీజేపీ ఆ పార్టీ కార్యకర్తలకు ఇది తీరని అవమానంగా విమర్శించింది. ఈ వివాదంపై పటోలే మాట్లాడుతూ గురు గజానన్ మహారాజ్ ప్రతీకాత్మక మైన పాదముద్రల ఊరేగింపులో పాల్గొన్న తరువాత తన పాదాలు బురదయ్యాయని, దగ్గరలో కొళాయి లేకపోవడంతో నీళ్లు తెమ్మని కార్యకర్తను కోరగా బాటిల్‌తో నీళ్లు తీసుకువచ్చారని వివరించారు.
పార్టీ కార్యకర్త తన బురద పాదాలను కడుగుతున్న వీడియో వైరల్ కావడంతో నానా పటోలేపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే కాంగ్రెస్ సంస్కృతి అంటూ ముంబై బీజేపీ మండిపడింది. పార్టీ కోసం ప్రాణాలను అర్పించే కార్యకర్తలను పదేపదే కాంగ్రెస్ అవమానిస్తోందని వ్యాఖ్యానించింది. రుణభారంతో కుంగిపోతున్న రైతులను ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించడం కర్తవ్యమైనప్పటికీ, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com