Navneet Kaur Rana: అన్నంత పనీ చేసిన ఎంపీ నవ్‌నీత్ కౌర్.. హనుమాన్ చాలీసాతో మళ్లీ..

Navneet Kaur Rana: అమరావతి ఎంపీ నవ్‌నీత్ కౌర్ అన్నంత పనీ చేశారు. హనుమాన్ చాలీసా చదివారు. కాకపోతే.. ఢిల్లీలోని కన్నౌట్‌లో హనుమాన్ చాలీసా పఠనం చేశారు. నవ్‌నీత్ కౌర్, భర్త రవి రానా, తన అనుచరులతో కలిసి ఢిల్లీలోని తన ఇంటి నుంచి పాత హనుమాన్ టెంపుల్ వరకు పాదయాత్ర చేశారు. ఆలయంలోనే హనుమాన్ చాలీసా చదివారు.
మూడు వారాల క్రితం మహారాష్ట్ర సీఎం ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతానని ప్రతిజ్ఞ చేశారు. అటు శివసేన కార్యకర్తలు సైతం హనుమాన్ చాలీసాతో నవ్‌నీత్ కౌర్ ఇంటిని ముట్టడించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కలిగించారంటూ నవ్‌నీత్ కౌర్ దంపతులను పోలీస్‌లు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. జైలు నుంచి వచ్చిన తరువాత ఢిల్లీలో చాలీసా పఠనం చేశారు నవ్‌నీత్ దంపతులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com