CDS chief: త్రిదళాల అధిపతిపై త్వరలోనే క్లారిటీ.. లిస్ట్‌లో వారి పేర్లు..

CDS chief: నూతన సీడీఎస్ ఎంపికకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం ఓప్యానల్‌ను ఎంపిక చేయనున్నారు.ఈ ప్యానెల్ సిఫారసు చేసిన పేర్లను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పంపుతామని అధికారులు చెప్పుకొచ్చారు. ఆయన ఆమోదం తెలిపిన అనంతరం సీడీఎస్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే కేబినెట్ నియామకాల కమిటీ వద్దకు పేర్లు వెళతాయని తెలిపారు.
ఆయన ఆమోదం తెలిపిన అనంతరం సీడీఎస్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే కేబినెట్ నియామకాల కమిటీ వద్దకు పేర్లు వెళతాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు కొత్త సీడీఎస్‌గా ఎంపికయ్యే అవకాశాలు సైన్యాధిపతి జరనల్ ఎంఎం నరవణెకే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవంలో అందరికన్నా సీనియర్ కావడం వల్ల ఈ పదవి దాదాపు ఆయనకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆర్మీ చీఫ్‌గా జనరల్ బిపిన్ రావత్ నుంచి 2019 డిసెంబర్ 31న నరవణె బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏప్రిల్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ప్రస్తుతమున్న వాయుసేన చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఈ ఏడాది సెప్టెంబర్ 30నే బాధ్యతలు స్వీకరించారు. నౌకాదళ అధినేత అడ్మిరల్ ఆర్.హరికుమార్ నవంబర్ 30న ఆ బాధ్యతలను తీసుకున్నారు.
వీరిద్దరు ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించడం.. మరోవైపు అనుభవంలో అందరికన్నా సీనియర్ అయిన నరవణెకే ఈ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిదళాధిపతుల ఎంపికకు అనుసరిస్తున్న విధానాన్నే సీడీఎస్ ఎంపిక విషయంలోనూ కేంద్రం పాటించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com