Bihar : బీహార్ లో మహిళల కోసం కొత్త స్కీం

బిహార్ లో మహిళా సాధికారిత కోసం JDU, NDA డబుల్ ఇంజిన్ సర్కార్ ..... కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు..... జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకు..... 7 వేల 500 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ పథకాన్ని ప్రధాని.. వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికీ 10 వేల రూపాయలు చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి... డబ్బు జమ కానుంది. అనంతరం మాట్లాడిన మోదీ.. గతంలో RJD పాలనలో మహిళలు చాలా బాధలు పడ్డారని, వారికి రక్షణ లేకుండా పోయిందని........ ఆరోపించారు. వారి పాలనలో శాంతిభద్రతలు దయనీయంగా ఉండేవని..... డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. బిహార్ లో మరోసారి RJD................. అధికారంలోకి రాకుండా చూసుకోవాలని మహిళలకు ప్రధాని పిలుపునిచ్చారు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com