భారత్‌లో కొత్తగా 86,432 కరోనా పాజిటివ్ కేసులు

X
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 40 లక్షల 23 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 86,432 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, అలాగే 1089 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొత్తగా 70,072 మంది కోలుకున్నారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం 40,23,180 కేసులు నమోదయ్యాయి. కొత్త డిశ్చార్జ్ లు సహా ఇప్పటివరకు 31,07,223 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,46,395 ఉండగా, 69,561 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.23 శాతంగా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
