NIA Raids : ఉగ్ర మూలాల్లోకి ఎన్ఐఏ

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఎస్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే 21 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది ఎన్ ఐఏ. 1999లో కాందాహర్ లో ఇండియన్ ఎయిర్ లైన్ విమానాన్ని హైజాక్ చేసిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇంటిని నిన్న పోలీసులు తనిఖీ చేశారు. ఏమైనా లింకులు దొరుకుతాయే మననే ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. అయితే కాందహార్ హైజాక్ తర్వాత అజార్ పాకిస్తాన్ పారిపోయి అక్కడే తలదాచుకుంటున్నాడు. విచారణలో భాగంగా ఇవాల 2023లో రాజౌరి దాడి ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు తీవ్రవాదులను ఎస్ఐఏ ప్రశ్నిస్తోంది. ఐఈడీ బాంబు పేల్చి 7 మంది పౌరులు ప్రాణాలు కోల్పో వడానికి కారణమైన ఆ ఘటనతో ప్రమేయమున్న తీవ్రవాదులు ముస్తాక్, నిజార్ ప్రస్తుతం జమ్మూ జైలులో ఉన్నారు. ఇటీవలి పహల్లాం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వారి పాత్రపై అధికారులు ఆ ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. కేసు దర్యాప్తు బాధ్యత తీసుకున్న ఎస్ఐఏ ఇప్పటికే బాధితుల కుటుంబ సభ్యులను కలిసి వివరాలు సేకరించింది. పహల్గాం ఘటనకు బాధ్యత వహిస్తూ రెసి స్టెంట్ ఫ్రంట్ ప్రకటన చేసిన తర్వాత పాక్ ప్రమే యంతోనే జరిగిందని భారత్ కొన్ని గట్టి చర్యలు తీసుకుంది. సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తు న్నట్లు కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. ఇక ని యంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా తొమ్మిదో రోజు ఎల్బీసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల మిరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com