NIA : ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

దేశ రక్షణ రహస్యాలను పాక్ గూఢచర్య సంస్థ సాయంతో లీక్ చేస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో గురువారం సోదాలు చేపట్టింది. భారత్‌లో గూఢచర్యానికి పాల్పడేందుకు పాక్ ఏజెంట్ల నుంచి డబ్బులు అందుకున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల నివాసాల్లో ఎన్‌ఐఏ బృందాలు ఈ సోదాలు చేపట్టినట్లు తెలిపింది.రక్షణశాఖ రహస్యాలను చేరవేసే కేసుకు సంబంధించి తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, హర్యానా రాష్ట్రాల్లోని 16 చోట్ల విస్తృత సోదాలు చేపట్టాం’ అని ఎన్‌ఐఏ ప్రకటనలో వెల్లడించింది. 22 మొబైల్ ఫోన్లు,కీలక సమాచారం ఉన్న ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.ఇండియన్ నేవీకి చెందిన కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు పాక్ కుట్ర 2021లో వెలుగు చూసింది. ఈ గూఢచర్యం కేసులో ఐఎస్‌ఐ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం 2023లో ఈ కేసు ఎన్‌ఐఏకి చేరింది. దీంట్లో పాకిస్థానీ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు తేలింది. ఈ కేసులో ఇప్పటికే పలు అనుబంధ చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com