Nirmala Sitharaman : పాత పన్ను విధానంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Nirmala Sitharaman : పాత పన్ను విధానంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
X

కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది. ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి 12 లక్షల వరకు ఆదాయ పన్ను రద్దు చేసింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పాత ఆదాయ పన్ను విధానాన్ని రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పందించారు. పాత పన్ను విధానాన్ని రద్దు చేసే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. పాత పన్ను విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాద ఏదీ తమ వద్ద లేదన్నారు. రిటర్నులు దాఖలు చేసే విధానాన్ని మరింత సరళంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కొత్త పన్ను విధానాన్ని తీసుకు వచ్చామని చెప్పారు. 1961లో తీసుకు వచ్చిన ఆదాయ పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు, చేర్పులతో కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని నిర్మలాసీతారామన్ తెలిపారు.

Tags

Next Story