Nitish Kumar: "ఇండియా" పేరు వద్దని చెప్పినా వినలేదు.. నితీశ్ కుమార్

బిహార్ లో NDAతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తొలిసారి ఇండియా కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కూటమి పేరు ఎంపిక సమయంలో "ఇండియా" కాకుండా మరోపేరు పెట్టాలని కోరినప్పటికీ తన మాట వినిపించుకోలేదన్నారు. ఇండియా కూటమిలో ఇప్పటికీ సీట్ల సర్దుబాటు పూర్తి కాలేదని.. నీతీశ్ కుమార్ చెప్పారు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ ఇండియా కూటమి ఒక్కపని కూడా చేయలేకపోయిందని విమర్శించారు. అందుకే బిహార్ లో మహాకూటమిని వీడాల్సి వచ్చిందన్నారు. తమ ఒత్తిడి వల్లనే బిహార్ లో కులగణన జరిగిందన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో అర్థంలేదని నీతీశ్ పేర్కొన్నారు. కులగణన ఎప్పుడు జరిగిందో మర్చిపోయారా అని ప్రశ్నించారు. 2019-2020లో అసెంబ్లీ నుంచి మొదలు బహిరంగసభల వరకు అన్నిచోట్లా కులగణన గురించి తాను మాట్లాడిన విషయాన్ని నీతీశ్ కుమార్ గుర్తు చేశారు.
అయితే బీజేపీతో కలవడంపైనా నితీశ్ కుమార్ తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చారు. తాను ఇంతకుముందు ఎవరితో పనిచేశానో తిరిగి వారితోనే కలిసానని చెప్పారు. బీహార్ ప్రజల కోసం తాను పనిచేస్తూనే ఉంటానని నితీష్ కుమార్ తెలిపారు. ఇక ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్‌లో విజయవంతంగా నిర్వహించిన కుల గణనకు సంబంధించిన క్రెడిట్‌ను దక్కించుకోవాలని రాహుల్ గాంధీ ప్రయత్నించారని నితీష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కులగణన ఎప్పుడు జరిగిందో రాహుల్ మరిచిపోయారా అని నితీశ్ కుమార్ ప్రశ్నించారు. 9 పార్టీల సమక్షంలోనే తాను బీహార్‌లో కులగణన చేపట్టానని.. 2019 నుంచి 2020 మధ్య అసెంబ్లీలో, బయట, బహిరంగ సభల్లో ప్రతి చోట కులగణన అంశంపై తాను మాట్లాడానని.. అయితే ఆ ఘనతను దక్కించుకోవాలని రాహుల్ గాంధీ చూశారని నితీష్ కుమార్ ఆరోపించారు.
తాను విపక్ష కూటమిని వీడి గతంలో తన ప్రయాణం సాగించిన వారి పక్షానికి చేరుకున్నానని, ఇక ఇప్పటినుంచి ఎన్డీయే కూటమిలోనే ఎప్పటికీ కొనసాగుతామని స్పష్టం చేశారు. బిహార్ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని అన్నారు. నూతన ప్రభుత్వం ఫిబ్రవరి 10న రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటుందని చెప్పారు. మరోవైపు నితీష్ కుమార్ యూటర్న్ మాస్టర్ అని కాంగ్రెస్, ఆర్జేడీలు ఆరోపించాయి. నరేంద్ర మోదీ యూటర్న్ మాస్టర్ అనుకుంటే నితీష్ కుమార్ ఆయనను మించిపోయారని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com