Nitish Kumar : బలపరీక్షలో నెగ్గిన నితీష్ సర్కార్

X
By - Manikanta |12 Feb 2024 5:40 PM IST
బిహార్ రాజకీయాల్లో నేడు కీలక ఘట్టం ముగిసింది. బలపరీక్షలో నీతీశ్ కుమార్ ప్రభుత్వం నెగ్గి్ంది. నీతీశ్ ప్రభుత్వానికి మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. వ్యతిరేకంగా 113 ఓట్లు వచ్చాయి. అయితే నితీష్‌కు అనుకూలంగా ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఓటేయ్యడం గమనార్హం. దీంతో విపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి.
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. ఇవాళ ఉదయం బిహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ నేత అవథ్ బిహారీ చౌదరిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గిన తరువాత నీతీశ్ కుమార్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. కాగా జనవరి 28న రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com