Nitin Gadkari : టూ వీలర్లకు ఫాస్టాగ్ లేదు : నితిన్ గడ్కరీ

Nitin Gadkari : టూ వీలర్లకు ఫాస్టాగ్ లేదు : నితిన్ గడ్కరీ
X

జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని వచ్చిన వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఇలాంటి వార్తల్లో వాస్తవం లేదని, టూ వీలర్లకు టోల్ వసూలు చేసే ప్రతిప్రధాన కాని, ఉద్దేశం కానిలేదని ఆయన స్పష్టం చేశారు. జులై 15 నుంచి టూ వీలర్లకు టోల్ వసూలు చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధిస్తున్నారని తప్పుదారి పట్టించే వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల సంసృకూడా ఇదే తరహా ప్రకటనను విడుదల చేసింది. ద్విచక్ర వాహనాలపై ఎలాంటి టోల్ వసూలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

Tags

Next Story