Kashmir CM : కొత్త కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పాటైన నవ జమ్మూ కశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.30 గంటలకు శ్రీనగర్‌లోని ఎస్‌కె ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లాతో మంత్రులుగా తొమ్మిది మంది చేత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు. పదవీ స్వీకార ప్రమాణ వేడుకకు ఎస్‌కెఐసిసిను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు.
ప్రభుత్వంలో చేరేందుకు మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదని వార్తలొచ్చాయి. బయటనుంచే ఒమర్ ప్రభుత్వానికి మద్దతు పలకాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఒమర్ అబ్ధులా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో మంత్రివర్గ కూర్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీచేశాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com