VI Towers : 6 నెలల్లో లక్ష వీఐ టవర్లు

VI Towers : 6 నెలల్లో లక్ష వీఐ టవర్లు
X

ప్రముఖ టెలికం సంస్థ వోడాఫోన్ ఐడియా (వీఐ) 2021-25 ఆర్ధిక సంవత్సరంలో ఆరు నెలల కాలం లోనే దేశవ్యాప్తంగా లక్షకు పైగా టవర్లను ఏర్పాటు చేసింది. ఈ మైలురాయిని అధిగమించిన సందర్భంగా సంస్థ కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమ నెట్వర్క్ మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో వేగవంతంగా విస్తరించడం, పటిష్టపర్చుకోవడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శమని వీఐ పేర్కొంది. నెట్వర్క్ న్ను పటిష్టపర్చుకున్న విషయాన్ని సరి కొత్తగా ఆకట్టుకునే విధంగా తెలిచేసేందుకు అవతార్ లు- ది నెట్టీస్ క్యాంపెయిన్ రూపొందించింది. మొబైల్ టవర్స్ స్పూర్తితో యానిమేటెడ్ క్యారక్టర్లు ఇందులో ఉంటాయి. నెట్వర్క్ విస్తరణలో ఏఐ గణనీయమైన పురోగతిని సాధించిందని తెలిపింది. ముంబై, పాట్నాలలో 5జీ సర్వీస్లు ప్రారం భించినట్లు తెలిపింది. త్వరలోనే ఢిల్లీ, బెంగళూర్లనూ 5జీ సేవలు ప్రారంభించనుట్లు ప్రకటించింది. తన 4జీ నెట్వర్క్ ను కూడా బలోపేతం చేయనున్నట్లు తెలిపింది.

Tags

Next Story