PM Modi : చాయ్ వాలాకే తేయాకు వాసన తెలుసు.. మోడీ హాట్ కామెంట్

PM Modi : చాయ్ వాలాకే తేయాకు వాసన తెలుసు.. మోడీ హాట్ కామెంట్
X

అసోం రాజధాని పట్టణం గువాహటిలో అతిపెద్ద ఝుమోయిర్ ఉత్సవాన్ని ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించారు. 9000 మందికిపైగా జూనియర్ డ్యాన్సర్లు సంగీతకారులతో ఈ వేడుక నిర్వహించారు. అసోం టీ పరిశ్రమ 200వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గువాహ టిలోని సరుసజై స్టేడియంలో మెగా నృత్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, టీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశారు. తేయాకు తోటల సౌందర్యం, టీ పరిమళాన్ని తాను తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరని అన్నారు. "టీ తోటల అందం, టీ వాసన టీ అమ్మే వ్యక్తి (చాయ్ వాలా) తప్ప మరెవరికీ తెలియదు. నాకు ఝుమోయిర్ నృత్యంతోనూ దగ్గరి సంబంధం ఉంది. అసోం గొప్ప వారసత్వంతో పాటు, భారతదేశ వైవిధ్యాన్ని ఇక్కడ చూస్తున్నాను అని సరుసజై స్టేడియంలో కిక్కిరిసిన జనసమూ హాన్ని ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. 2023లో అసోం వచ్చాను. 11,000 మందికి పైగా ప్రజలు కలిసి బిహు నృత్యం తో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇప్పుడు మీరంతా ఝుమోయిర్ నృత్యం ద్వారా మరో ప్రపంచ రికార్డును నెలకొల్పడానికి సిద్ధమయ్యారు.

Tags

Next Story